
BP control : అధిక రక్తపోటు సమస్య ఈ రోజుల్లో ఎక్కువవుతోంది. హైబీపీతో చాలా మంది బాధపడుతున్నారు. దీంతో చాలా రకాల సమస్యలు వస్తాయి. అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతి. అందుకే హైబీపీని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. రోజు మందులు తీసుకుంటేనే అన్ని రకాల చర్యలు తీసుకోవడం వల్ల బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. సాధారణ వ్యక్తికి 80/120 ఉంటేనే నార్మల్ గా ఉన్నట్లు అంతకంటే ఎక్కువ ఉంటే హైబీపీ ఉన్నట్లు భావించాలి. దీన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
హైబీపీ ఉన్న వారు ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ఇంకా మొత్తానికి మానేస్తే ఇంకా మంచిది. కానీ మనం ఉప్పును మానడం లేదు. ఫలితంగా బీపీని పెంచుకుని మన అవయవాలను దెబ్బతీసుకుంటున్నాం. అధిక రక్తపోటుతో గుండె, కిడ్నీలు, కళ్లు వంటి అవయవాలు దెబ్బతింటాయి. దాని ప్రభావాలు కనిపించకుండానే జరిగిపోతుంది.
ఈనేపథ్యంలో వ్యాయామం చాలా ముఖ్యమైనది. రోజు కనీసం 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం తప్పనిసరి. లేకపోతే ప్రాణాంతక వ్యాధులు రావడం గ్యారంటీ. ప్రతి రోజు నడక వల్ల మనకు రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి భోజనం చేశాక కూడా ఓ అరగంట పాటు వాకింగ్ చేయడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది.
అరటి, టమాటా, అవకాడో, బీన్స్, నట్స్ వంటి వాటిల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ ఆహారాల్లో మనకు రక్షణ కలిగించే ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో వీటిని తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. నిరంతరం చెక్ చేసుకుంటే బీపీని అదుపులో ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.