
Bananas : అరటి పండ్లు తినడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. ప్రొటీన్లు అందుతాయి. అరటిపండ్లతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఎథలీన్ అనే వాయువు ఉంటుంది. దీంతో పండ్లు త్వరగా మగ్గేందుకు దోహదపడుతుంది. దీని వల్ల పండ్లు త్వరగా పండేందుకు ఇది సాయపడుతుంది. అరటిపండ్లు పక్కపక్కనే ఉంటే పండ్లు త్వరగా పక్వానికి వస్తాయి.
అరటి పండ్లను విడదీయకుండా అలాగే వేలాడదీయాలి. ఒకదానికి మరొకటి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యాంగర్ కు తగిలించి గోడకు వేలాడదీస్తే పండ్లు త్వరగా ఎండిపోకుండా ఉంటాయి. దేనికి తగలకుండా గాల్లో వేలాడదీస్తే పండ్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అంతేకాని వేరే పండ్లకు తగిలితే త్వరగా పక్వానికి వస్తాయి. దీంతో పండిన పండ్లు కుళ్లిపోతాయి.
అరటి పండ్లు నిలువ ఉంచే చోట 13 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉండాలి. ఆ గదిలో ఎండ తగలకూడదు. నీడ ఉండాలి. చీకటి ప్రదేశంలో పండ్లను వేలాడదీయాలి. అప్పుడు పండ్లు త్వరగా పక్వానికి రాకుండా ఉంటాయి. దీని వల్ల పండ్లతో ఇబ్బందులు రావు. అరటిపండ్లను జాగ్రత్తగా చూసుకోకపోతే తొందరగా పండితే త్వరగా అమ్మాలి.
అరటి పండ్లు మగ్గించడంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకపోతే ఒకేసారి అన్ని పండ్లు మగ్గితే అమ్మడం కుదరదు. అందుకే వాటిని మగ్గించుకోవడంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇలా అరటి పండ్లు మగ్గించుకునేందుకు పలు మార్గాలు పాటించాలి. పండ్లు ఒకేసారి కాకుండా విడతల వారీగా మగ్గించుకుని అమ్ముకుంటే లాభం వస్తుంది.