
ఆదిపురుష్.. వచ్చే నెల జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేసి జూన్ కు షిఫ్ట్ చేసారు.. మరి రిలీక్ కు మరో నెల మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు..
ఇటీవల పోస్టర్స్, ట్రైలర్ రిలీజ్ చేసారు.. ఈ ట్రైలర్ తో ఆదిపురుష్ అంచనాలు మరింత పెరిగాయి.. ”ఆదిపురుష్” సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు.. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీతగా కృతి సనన్ నటించింది.. అలాగే రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.. మొన్న ట్రైలర్ లోనే వీరంతా తమ తమ పాత్రలకు న్యాయం చేస్తున్నట్టు కనిపించింది..
ఇదిలా ఉండగా తాజాగా డార్లింగ్ ప్రభాస్ భద్రాచలం లోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానికి 10 లక్షల విరాళం అందించారు.. తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరిట ఈ భారీ విరాళాన్ని ప్రభాస్ ప్రకటించారు.. 10 లక్షల చెక్ ను ప్రభాస్ తరపున ఆయన బంధువులు దేవస్థానం ఈవో ఎల్ రమాదేవికి శనివారం అందించారు..
ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.. రాముడి శ్రీరాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమాను ఎటువంటి ఆటంకాలు రాకుండా ఇంత భారీ విరాళం ప్రకటించినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.. మరి ఈ సినిమా సూపర్ హిట్ అయితే ప్రభాస్ భద్రాచలం వస్తారు అని కూడా టాక్ వస్తుంది.. చూడాలి మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో..