
Devara : ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా దేవర సెప్టెంబర్ 27న విడుదల కాగా, సరికొత్త కలెక్షన్ల తో దూసుకుపోతున్నది. ఎన్టీఆర్ సినీ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ వారంలో రూ.500 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ లలో ఎలా ఇరగదీస్తాడో అందరికీ తెలిసిందే. దేవర సినిమాలోనూ తన డ్యాన్సులతో మరోసారి మెస్మరైజ్ చేశాడు. ఇక దేవర ప్రదర్శిస్తున్న థియేటర్లలో ‘ఆయుధ పూజ’ పాట వచ్చినప్పుడు సీట్లలో కూర్చోలేకపోతున్నారు. అభిమానులు స్టెప్పులు వేస్తూ గోలగోల చేస్తున్నారు. ఆ పాట వచ్చినప్పుడు పరవశంతో పులకించిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. ముఖ్యంగా అమ్మాయిలైతే ఈ పాటకు రీల్స్ చేస్తూ తెగ సంబురపడిపోతున్నారు. ఆయుధ పూజ పాట షూట్ చేసే సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయమైన విషయం తెలిసిందే.
‘దేవర’ బ్లాక్ బస్టర్ తర్వాత సుమ కనకాలకు హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ ఇంటర్వ్యూ ఇచ్చారు. వారి మధ్య ‘ఆయుధ పూజ’ పాట గురించి, అందులో ఎన్టీఆర్ వేసిన స్టెప్పుల గురించి చర్చ జరిగింది. అయితే ‘ఆ పాటలో ఎన్టీఆర్ కత్తి తిప్పే సందర్భం ఒకటి ఉందని, అది చేసేటప్పుడు చేతికి గాయమైందని ఎన్టీఆర్ తెలిపారు. చేతికైనా గాయం కవర్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని డైరెక్టర్ కొరటాల శివ తెలిపారు. ఈసారి ఆ సాంగ్ చూసినప్పుడు నిశితంగా గమనిస్తే ఆ మార్పు తెలుస్తుందని కొరటాల శివ తెలిపారు..






