Devara Pre Relaese Event : దాదాపు రెండున్నరేళ్లపాటు తెరమీద కనిపించని యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తొలిసారి సోలో హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో ఎన్టీఆర్ సినిమా విడుదల కాబోతున్నది. ఆర్ఆఆర్ఆర్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ మరోసారి దేవరతో సౌత్ టు నార్త్ అన్నిభాషల ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్ధమయ్యాడు.
హ్యాట్రిక్ కొట్టాలని..
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్టయ్యాయి. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు అటు ఎన్టీఆర్, ఇటు కొరటాల శివకు మంచి పేరు తెచ్చుపెట్టాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ మరింత హైప్ పెంచాయి. శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా కూడా హ్యాట్రిక్ కొడుతుదంని నమ్మకంగా ఉన్నారు. కాగా ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు కల్యాన్ రామ్, డైరెక్టర్ శివ తన మిత్రులతో కలిసి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. విడుదలకు మరో పది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు. చిట్ చాట్ లు, ఇంటర్వ్యూలు ముమ్మరంగా సాగుతన్నాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులు వీరే..
విడుదలకు ముందు అసలైన ఈ వెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అందరి చూపు పడింది. మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 22 న హైదరాబాద్ నిర్వహించనున్నారని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా గా ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా కొరటాలా ఎవరెవరిని తీసుకురాబోతున్నారనే చర్చ సాగుతున్నది. మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు రావొచ్చని తెలుస్తున్నది. బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారనే టాక్ వినిపిస్తు్నది.