brahmanandam wife: 80’s-90’s లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరు రవిరాజా పినిశెట్టి. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలను తెరకెక్కించాడు. చిరంజీవి, బాలకృష్ణ, శోభన్ బాబు, మోహన్ బాబు, వెంకటేశ్, కార్తీక్, రాజశేఖర్, అర్జున్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. మోహన్ బాబు- రవిరాజా పినిశెట్టి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా పెదరాయుడు. 1995లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టడమే కాదు.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. థియేటర్లలో 150 రోజులకు పైగా ఆడింది. తమిళంలో 1994లో వచ్చిన ‘నాటమ్మాయి’కి రీమేక్. రజనీకాంత్ లాంటి స్టార్ యాక్టర్ కొంత సేపు కనిపించారు.
భాను ప్రియా, సౌందర్య మోహన్ బాబు పక్కన నటించారు. రాజా రవీంద్ర, ఆనంద్ రాజ్, శుభశ్రీ, జయంతి లీడ్ రోల్స్ పోషించారు. కమెడియన్లలో బ్రహ్మానందం, బాబుమోహన్, ఎంఎస్ నారాయణ, పాకీజా, మాస్టర్ మహేంద్ర, చలపతి రావు ఉన్నారు. అప్పట్లో కోటి మ్యూజిక్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ‘బావవి నువ్వు.. భామను నేను..’, ‘అబ్బా దాని సోకు చూసి వచ్చా వచ్చా’, ‘కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా’, ‘డమ డమ గుండె ఢమరుకం మోగే’ అన్నీ హిట్ సాంగ్సే. కామెడీకి సపరేట్ ట్రాక్ ఇచ్చారు పినిశెట్టి. తండ్రీ కొడుకులుగా బాబూ మోహన్, బ్రహ్మానందం నటించిన సంగతి విధితమే. స్త్రీలోలుడైన బాబూమోహన్ బ్రహ్మానందానికి తల్లి ఎవరో చెప్పకుండానే పెంచుతుంటాడు. ఈ కారణంగానే కొడుకైన బ్రహ్మానందానికి పెళ్లి సెట్ కాదు.
తండ్రికి కూడా చెప్పకుండా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తెస్తాడు. అక్కడ ఫన్ ట్రాక్ జనరేట్ అవుతుంది. తండ్రిని కొడుకు బ్రహ్మానందం తిడుతుంటే.. ‘ఎంత కాదన్నా నీకు తండ్రి, నాకు మామ గారు’ అంటూ కోడలు ఆశీర్వాదాలు తీసుకుంటుంది. ఆ కోడలు ఎవరో తెలుసా? జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్యశ్రీ తల్లి. జబర్ధస్త్ లో చమ్మక్ చంద్ర టీంలో సత్య శ్రీ పని చేసింది. ఆ తర్వాత మరో కామెడీ షోలో కనిపించింది. కానీ మళ్లీ జబర్ధస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చి కొనసాగుతుంది. ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీంలో కనిపిస్తుంది. తల్లి నుంచి నటనను వారసత్వంగా తీసుకుంది సత్యశ్రీ. పెదరాయుడు, ఆర్య 2, నరేష్ యముడికి మొగుడు, ఇష్క్ వంటి చిత్రాల్లో సత్యశ్రీ తల్లి నటించింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన తల్లి నటనను మానేసిందని సత్యశ్రీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
View this post on Instagram