GameChanger Teaser: మెగాఅభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ నుంచి టీజర్ వచ్చేసింది. దాదాపు 1.30 నిమిషాల నిడివి ఉన్న టీజర్ మెగా అభిమానులను విపరీతంగా అకట్టుకుంటున్నది.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కియారా అడ్వాణీ ఇందులో హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తోశంకర్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నాడని టాక్. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను జనవరి 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నవంబర్ 9న ‘గేమ్ ఛేంజర్’ టీజర్ విడుదల కాగా, వీక్షకులను ఆకట్టుకుంటున్నది. రామ్ చరణ్ ఇందులో ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. మరో క్యారెక్టర్ పొలిటిషియన్ గా చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇక ఇందులో చరణ్ నటన, డైలాగులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. తమన్ ఇచ్చిన మ్యూజిక్ టీజర్‌ను మరింత ఎలివేట్ చేస్తున్నది. ఇక శంకర్ తన గత చిత్రాల లాగే సామాజిక అసమానతలు, అన్యాయాలను ఇందులోనూ మరో కోణంలో ఆవిష్కరించబోతున్నాడు. శంకర్ సినిమాలన్నీ సమాజంలోని ఏదో సెక్షన్ ఎదుర్కొంటున్న వివక్ష లేదా ఇతర సమస్యలను నేపథ్యంగా ఎంచుకుంటుంటాడు. జెంటిల్ మెన్ నుంచి మొన్నటి భారతీయుడు-2 వరకు సమాజంలోని సమస్యల నుంచి ఎంచుకున్న కథలే. వాటినే ప్రేక్షకులను నచ్చేలా, కమర్షియల్ విలువలు జోడించి సక్సె స్ లు సాధిస్తున్నాడు. అయితే ఇటీవలి భారతీయుడు చిత్రం శంకర్ కు భారీ డిజాస్టర్ ను మిగిల్చింది. ఇప్పటికే ఆ సినిమా నెగెటివ్ ప్రభావం గేమ్ చేంజర్ మీద కనిపించినా, టీజర్ తో అవన్నీ చెల్లా చెదురయ్యాయి.