Ganda Director Speech : సంచనాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. ఆయనకే మొగుడిగా మారాడు వారణాసి సూర్య. పైగా ఇది కూడా ఆయన చెప్పిన కాన్సెప్ట్ అంట. జీరో బడ్జెట్ తో సినిమా తీయవచ్చని ఆయన గతంలో చెప్పారు. దానికి సంబంధించిన వీడియోను కూడా బయటకు పంపించారు. అదే స్ఫూర్తితో ఒక దర్శకుడు సినిమా తీశాడు. రిలీజ్ ఫంక్షన్ కు రావాలని కోరితే ఆర్జీవీ మొహం చాటేశాడు. దీతో వారణాసి సూర్య ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అక్రమ సంబంధం గురించి చెప్పాడు.
వారణాసి సూర్య ప్రస్తుతం ఒక సినిమా తీశాడు ఆ మూవీ పేరు ‘గండ’. ఈ సినిమా తాను ఆర్జీవీ ఇచ్చిన కాన్సెప్ట్ నుంచే వచ్చిందంటూ సూర్య చెప్పాడు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీయడం కాదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా (జీరో బడ్జెట్) కూడా సినిమా తీయవచ్చు. అది కూడా సక్సెస్ చేయవచ్చు అంటూ వర్మ చెప్పాడు. ఆయన ఇన్పిరేషన్ నుంచే గండ వచ్చింది అంటూ వారణాసి సూర్య చెప్పారు. బుధవారం (జూన్ 28) ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన మీడియా మీట్ లో సూర్య మాట్లాడాడు.
‘నా పాయింట్ ఆఫ్వ్యూలో నా మొగుడు ఆర్జీవీ. ఆయనకు నాకు అక్రమ సంబంధం ఉంది. 10 ఏళ్ల క్రితం ఆయన చెప్పిన జీరో బడ్జెట్ కాన్సెప్ట్ నచ్చింది. అసలు ఆర్జీవీ చెప్పిన విషయం ఇండస్ట్రీ బాగుపడేందుకా..? లేక ఆర్టిస్టుల కోసమా తెలియదు కానీ నాకు బాగా నచ్చింది. ఈ కాన్సెప్ట్ తోనే ‘ఈజీ సినిమా’ బ్యానర్ కూడా పెట్టాను. ఇప్పటి వరకు మీడియాను వాడుకొని ఆయన బతికాడు. ఇప్పుడు ఆయనను వాడుకొని నేను బతకబోతున్నాను. ఇది ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా.. ఆర్జీవిని వాడుకోబోతున్నాను.
ఆయనకు సక్రమ బంధాలు లేవు కాబట్టి నేను ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. ‘గండ’ బిడ్డను కూడా కన్నాను. ఆ బిడ్డకు తండ్రి ఆర్జీవీనే. ఆయనకు చాలా సార్లు విన్న వించాను. ఈ కాన్సెప్ట్ బయటకు వచ్చి ప్రమోట్ చేయమని. కానీ వాటిని ఆయన పట్టించుకోలేదు. తన గండం గురించి కూడా చెప్పి ప్రమోట్ చేయమని అడిగితే ఆయన స్పందించడం లేదు’ అన్నాడు సూర్య.