Ram Charan Remunaration: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరు. తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో చేసిన ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర, సినిమా గురించి టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్టు తర్వాత ఆయన సన బుచ్చిబాబు దర్శకత్వంతో ‘RC16‘ ప్రొడక్షన్ టైటిల్ లో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టుకు రామ్ చరణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటూ చర్చ మొదలైంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో గ్లోబల్ స్టార్ గా మారి.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖంగా మారాడు. దీంతో అతని కోసం ప్రాజెక్టులు క్యూ కట్టాయి. ప్రస్తుత రిపోర్ట్స్ ప్రకారం.. రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ మొత్తాన్ని రూ. 30 కోట్ల మేర పెంచాడు. అంటే తాత్కాలికంగా RC16 టైటిల్‌తో ఉన్న అతని తదుపరి చిత్రానికి రూ. 125 నుంచి రూ. 130 కోట్లను తీసుకోనున్నారట.
గేమ్ ఛేంజర్ కోసం రూ. 95 నుంచి రూ. 100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ టాలీవుడ్ స్టార్ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం రజినీకాంత్, అల్లు అర్జున్, తలపతి విజయ్, ప్రభాస్ తో పాటు సౌత్ లో అతిపెద్ద స్టార్ల లిస్ట్ లో చేరాడు. RC 16 రూ. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. అందుకే రామ్ చరణ్ రెమ్యునరేషన్ కూడా ఆ మేరకే తీసుకుంటున్నారట. RC16లో జాన్వీ కపూర్ కూడా కనిపిస్తుందట. దీనికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.