
Prbhas pic leak: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆరు సినిమాలు లైన్ లో ఉన్నాయి. కానీ ఈ గ్యాప్ లో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కోరిక మేరకు ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్పలో ఓ కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులోని ఒక్కో క్యారెక్టర్ ను ప్రతి సోమవారం రివీల్ చేస్తూ వస్తున్నాడు హీరో విష్ణు. ఆ క్యారెక్టర్ పేరు, నటుడి గురించి వెల్లడిస్తూ వస్తున్నారు.
గతంలో విడుదల చేసిన టీజర్ లో అందరి నటీనటుల మేకోవర్, గెటప్ రివీల్ చేశారు. కానీ ప్రభాస్ చేస్తున్న క్యారెక్టర్ మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ప్రభాస్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. కానీ ఒక్కసారిగా నెట్టింట కన్నప్పలోని ప్రభాస్ లుక్ బయటకు రావడంతో మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. తామెంతో కష్టపడి సినిమా తీస్తుంటే ఇలా దొంగతనంగా ఫొటోలు బయటకు విడుదల చేయడం సమంజసం కాదంటున్నారు.
ఆకట్టుకుంటున్న ప్రభాస్ లుక్
కన్నప్పలో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటున్నది. భక్తుడిగా పూర్తి ఆధ్యాత్మిక భఆవంతో ప్రభాస్ గెటప్ అదిరిపోయింది. ఆదిపురుష్ లో రాముడి అవతారంతో విమర్శల పాలైన ప్రభాస్ కన్నప్పలో కనిపించిన లుక్ వావ్ అనిపించుకుంటున్నాడు. నుదిటిపై విభూతి, మెడలో రుద్రాక్ష మాలతో సాధువులా కనిపిస్తున్నాడు. ప్రభాస్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నది.