Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి టాలీవుడ్ లో తొలి సినిమాతో సెన్సార్ బోర్డు నుంచి ఇండస్ర్టీలో బిగ్ షాట్స్ వరకు ఎంతో మందికి షాకిచ్చాడు. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో కూడా చేసి సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత యానిమల్ సినిమాతో బాలీవుడ్ కే షాకిచ్చాడు. అటు అర్జున్ రెడ్డి, ఇటు యానిమల్ సినిమాలతో మహిళా వ్యతిరేకిగా ముద్ర పడ్డాడు సందీప్. అయినా వాటిని పట్టించుకోకుండా తను అనుకున్న విధంగానే సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమాపై మరింత కసరత్తులు చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ఫిలిం ఇండస్ర్టీలో టాక్ వినిపిస్తున్నది. దీంతో సందీప్ రెడ్డి తన ఫోకస్ అంతా స్పిరిట్ మీదే పెట్టాడట. యానిమల్ సినిమాతో 900 కోట్లు కొల్లగొట్టిన సందీప్ రెడ్డి ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడోనని బీ టౌన్ లో టాక్ నడుస్తున్నది.
తొలి సినిమా సెట్స్ మీదకు వెళ్లి అది రిలీజ్ అయ్యే వరకు ఎన్నో ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కొన్నాడు. స్ర్తీ వ్యతిరేకిగా ముద్ర పడ్డాడు. ఒక దశలో అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలను బ్యాన్ చేయాలని మహిళా సంఘాలు ఆందోళనలు కూడా చేశాయి. అయితే సందీప్ రెడ్డిని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. రౌడీ స్టార్ అనే ట్యాగ్ కూడా సందీప్ రెడ్డి తీసిన అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిందే. తనకు ఎంతో ఆప్తమిత్రుడైన సందీప్ రెడ్డి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు విజయ్. సందీప్ కు సినిమా అంటే ప్యాషన్ అని, ఒకసారి సినిమా తీయాలని ఫిక్సయితే ఫోకస్ అంతా దాని మీదే ఉంటుందని, మరో ఆలోచన ఉండదన్నాడు విజయ్. ప్రస్తుతం స్పిరిట్ సినిమా మీదే దృష్టి పెట్టాడని, అందులోంచి ఇప్పట్లో బయటికి రాడని అంటున్నాడు.మరి స్పిరిట్ తో సందీప్- ప్రభాస్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాల్సిందే.