South Star Heroin: సౌత్‌లో టాప్ హీరోయిన్లలో ఈ చిన్నది కూడా ఒకరు. తొలి చిత్రంతోనే తన గ్లామర్, పెర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీలో కూడా వరుస హిట్లతో దూసుకుపోయి తన కంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మకు యూత్‌లో ఉన్న క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే. ఇంతకీ ఈ చిన్నది తెలుసా.. ? పైన ఫోటోలో ముద్దు ముద్దుగా కనిపిస్తున్న ఆ అమ్మాయి సౌత్ లో మోస్ట్ వాంటెడ్ టాప్ హీరోయిన్. యూత్ ఫేవరేట్ బ్యూటీ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కెరటం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా అంతగా ఆడకున్నా తర్వాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా రకుల్ ను హీరోయిన్ గా నిలబెటట్టింది. ఆ తర్వాత రామ్ చరణ్, గోపీచంద్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో చేసింది.
ఇటీవల పెళ్లి చేసుకున్న రకుల్ సినిమాలకు దూరంగా ఉంటున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటిలాగే హడావిడి చేస్తుంది. ఇటీవల చిల్డ్రన్స్ డే సందర్భంగా తన చిన్నపపటి వీడియోను ఇన్ స్టాలో పంచుకుంది
రకుల్ చిన్నప్పుడు చిన్నప్పుడు ఆడుకోవడం.. డ్యాన్స్ చేయడం.. ఐస్ క్రీమ్ తినడం.. బర్త్ డే కేక్ కట్ చేయడం లాంటివి ఆమె తల్లిదండ్రులు క్యాప్చర్ చేశారు. ఇలా ఎన్నో మెమొరీస్ ను పదిలంగా దాచి పెట్టారు. చిన్నప్పటి వీడియోలన్నింటిని ఆమె పెళ్లి రోజు కానుకగా ఇచ్చారు.