ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కిలిగిన సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ అంటే నమ్ముతారా? అవునండి ఒక సంవత్సరంతో పోల్చుకుంటే ప్రపంచంలో ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసేదిఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీనే. ఇక టాలీవుడ్, కోలివుడ్, శాండల్ వుడ్.. ఇలా చెప్పుకుంటే నార్త్, సౌత్ రెండుగా విభజించినా అన్ని ఇండస్ట్రీలు ఇండియావే.
ఇక్కడి స్టార్లకు రాను రాను పాన్ వరల్డ్ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది. ఇండియన్ హీరో అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రభాస్ నుంచి రాం చరణ్, తారక్.. ఇలా కొంత మంది ఇప్పుడు ప్రపంచం మొత్తం పరిచయమే. ఇక ఇక్కడి స్టార్ల పారితోషికం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఒక్కో సినిమాకు పదుల సంఖ్యను దాటి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంటే ఒక్కో సినిమాకు వందల కోట్లు తీసుకుంటున్నారన్న మాట. ఒక సినిమా వరల్డ్ వైజ్ భారీ కలెక్షన్లు సాధిస్తే చాలా టాప్ బ్రాండ్లు వాటి ప్రమోషన్ల కోసం వెంట పడుతుంటాయి. అలా కూడా మరింత ఆదాయం సమకూరుతుంది. ఇండియాలో టాప్ 5 సంపన్న హీరోల గురించి పరిశీలిస్తే..
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక్కో సినిమాకు వందల కోట్లు తీసుకుంటున్నాడు. పైగా ఐపీఎల్‌లో సొంత జట్టు కూడా ఉంది. ఒక ప్రొడక్షన్ హౌజ్ ఉంది. ఆయన చేతిలో అనేక బ్రాండ్లు ఉన్నాయి. షారుఖ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 6300 కోట్లు.
సెకెండ్ ప్లేస్ హృతిక్ రోషన్ ది. బాలీవుడ్‌లో ప్రతిభావంతులైన హీరోల్లో ఈయన ఒకరు. ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్లు తీసుకుంటున్నాడు. బ్రాండ్లను ప్రమోట్ చేస్తే ఒక్కో బ్రాండ్ వద్ద రూ.10 కోట్లు తీసుకుంటాడు. (HRx) అనే దుస్తులు, షూ బ్రాండ్ కూడా సొంతంగా నిర్వహిస్తున్నాడు. ఈయన ఆస్తి రూ. 3100 కోట్లు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ సీనియర్ నటుడు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో రివార్డులు, అవార్డులు, పద్మశ్రీలు కూడా పొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీకే పెద్ద దిక్కు. సినిమాలతో పాటు షోలకు కూడా హోస్ట్ గా వ్యవహరించేవాడు. ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. ఆయన ఆస్తి రూ. 3000 కోట్లు.
సల్మాన్ ఖాన్ ఈయనకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ బాలీవుడ్ అనే గుర్తింపు కూడా ఉంది. బాలీవుడ్‌లో సల్మాన్ కు బ్రాండ్ ఇమేజ్ ఉంది. సొంతంగా దుస్తుల కంపెనీ ఉంది. 57 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సల్మాన్‌క ఆస్తుల విలువ సుమారు రూ. 2850 కోట్లు.
బాలీవుడ్‌లో వేగంగా సినిమాలు చేసే హీరోల్లో అక్షయ్ కుమార్ ఫస్ట్ ప్లేస్. ఏడాదిలో ఆయన నటించిన 3, 4 సినిమాలు విడుదలవుతున్నాయి. ఆయన ఆస్తి రూ. 2,660 కోట్లు. దేశంలో అత్యధిక పన్ను చెల్లించే హీరోల్లో ఆయనదే అగ్రస్థానం
అమీర్ ఖాన్ నటనకు విరామం ఇచ్చాడు. అలాగని డిమాండ్ మాత్రం తగ్గలేదు. అమీర్ చాలా వెంచర్లలో భారీగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లాడు. పైగా సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఆయన ఆస్తి రూ. 1862 కోట్లు.
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో గ్లోబల్ ఇమేజ్ ను దక్కించుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ కాలమే అయినా వేగంగా ఎదిగాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ఉంది. ఇక ఒక్కో సినిమాకు చాలానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. చెర్రీ ఆస్తుల విలువ రూ. 1370 కోట్లు.
అగ్రహీరోల్లో అక్కినేనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు తీసుకుంటాడు. బిగ్‌బాస్ హోస్ట్‌గా కూడా రూ.15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంకా ప్రొడక్షన్ హౌజ్, జ్యువెల్లరీ ఇలా కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ రూ. 950 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండస్ట్రీలో ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఆయన నటించిన ‘జైలర్’ ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్లతో ముందుకెళ్తోంది. ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఆయన ఆస్తి దాదాపు రూ. 450 కోట్లకు పైమాటే.
పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఆయన ఆస్తి విలువ రూ. 380 కోట్లు. అతనికి సొంత మల్టీప్లెక్స్ కూడా ఉంది. ప్రస్తుతం ‘పుష్ప 2’లో బిజీగా ఉన్నాడు.