Yellamma Script:నేచురల్ స్టార్ నాని ఎక్కువగా యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహిస్తున్నాడు. తను హీరోగా చేసే సినిమాలతో పాటు తన ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న చిత్రాల్లో సైతం కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. ఇటీవల నానిపై ఓ రూమర్ బాగా స్ర్పెడ్ అవుతున్నది. బలగం లాంటి సూపర్ హిట్ కొట్టిన వేణు యెల్దండితో సినిమా కమిట్ అయ్యాక, ఆ మూవీని హోల్డ్ లో పెట్టాడని గాసిప్ వినిపిస్తున్నది. స్ర్కిప్ట అంతా సిద్ధమయ్యాక హీరో నాని ఈ సినిమా చేయనని చెప్పాడనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నది.
లో బడ్జెట్ తో ఎక్కువగా కొత్త ఆర్టిస్టులతోని కుటుంబ అనుబంధాల నేపథ్యంతో సినిమా తీసి హిట్టుకొట్టాడు కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు. నిర్మాత దిల్ రాజుతో పాటు టీమ్ అందరికీ ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. అప్పటి దాకా జబర్దస్త్ ట్యాగ్ తో ఉన్న వేణు ఒక్కసారిగా బలగం వేణుగా మారిపోయాడు. సూపర్ హిట్ కొట్టిన వేణుకు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం వేణు తన తొలి చిత్ర నిర్మాత దిల్ రాజుతో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తాను సిద్ధం చేసుకున్న ఎల్లమ్మ కథను నానికి వినిపించాడు. కథను ఓకే చేసిన నాని స్క్రిప్ట్ పూర్తయ్యాక మాత్రం వద్దన్నాడట. దీంతో వేణు కొద్ది రోజులు ఖాళీగా ఉండిపోయాడు.
నితిన్ వద్దకు ‘ఎల్లమ్మ’
స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో దర్శకుడు వేణు యెల్దండి ఎల్లమ్మ కథను యువ హీరో నితిన్ కు వినిపించాడట. తెలంగాణకు చెందిన హీరో నితిన్ ఎల్లమ్మ కథ ప్రాశస్త్యం తెలియడంతో వెంటనే ఒప్పేసుకున్నాడట. త్వరలో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు తన తొలి సినిమా నితిన్ తో చేశాడు. ఇద్దరూ ఒకే జిల్లా కావడం, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి డిస్ర్టిబ్యూటర్ గా సినీ రంగంలో ఉండడం, వీరిద్దరూ పంపిణీదారులుగా కలిసి సినిమాలు విడుదల చేసిన సాన్నిహత్యం పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తు్న్నాయి.
ఎల్లమ్మ కథపై ఆసక్తి..
.వేణు రాసుకున్న ఎల్లమ్మ మూవీ కథ నేపథ్యం ఏమిటి? కథలో మార్పులను వేణు అంగీకచించకపోవడానికి కారణాలు ఏమిటని అందరిలో ఆసక్తి నెలకొంది. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా వేణు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని తెలుస్తుంది.