నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెతపా డుగ్గు డుగ్గని అనే పాటకు నూతన వధూవరులు డ్యాన్స్ చేసిన సంఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కాగా ఆ పెళ్లి కొడుకే ఈ అశోక్. తాజాగా అశోక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఈరోజు బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. అశోక్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పని చేస్తున్నాడు.
అయితే ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతి నిరాకరించారు. అయితే లంచం ఇస్తే మాత్రం వెంటనే అనుమతి ఇస్తామని 30 వేలు డిమాండ్ చేయడంతో ఆ మొత్తం ఇస్తామని చెప్పి ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పక్కా ప్లాన్ ప్రకారం అశోక్ ను అరెస్ట్ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఇలా వల వేసి పట్టుకున్నారు.