Vijayamma: కొన్ని రోజులుగా జగన్, షర్మిల మధ్య ఆస్తివ్యవహారం ఏపీ అంతా హాట్ టాపిక్ గా మారింది. తనను తన అన్న మోసం చేస్తున్నాడని షర్మిల ఏకంగా చంద్రబాబుకు లేఖలో మొరపెట్టుకోవడంతో ఇద్దరి మధ్య మరింత నిప్పు రాజుకుంది. వైసీపీ నాయకులు షర్మిలకు గట్టి కౌంటరే ఇస్తున్నారు. అయితే ఈ విమర్శలు తన అన్నే పని గట్టుకొని చేయిస్తున్నాడని షర్మిల వాపోతోంది. అయితే, ఇద్దరి మధ్య రోజు రోజుకు దూరం ఎక్కువవుతూనే ఉంది. ఇద్దరు పిల్లలు ఆస్తుల కోసం కొట్లాడుతుంటే తల్లి విజయమ్మ మాత్రం నోరు మెదపడం లేదు.
2019 ఎన్నికల సమయంలో వైసీపీ గెలుపునకు తాను ఎంతో శ్రమించానని, పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చేందుకు ఎంతో కష్టపడిన నన్ను నా అన్న జగన్ మోసం చేశాడని షర్మిల కన్నీటి పర్యంతమైంది. 2019లో ప్రభుత్వం ఏర్పడ్డాకు పదవుల కోసం నేను ఎన్నడూ అడగలేదని కానీ నన్ను పార్టీ నుంచి పంపించేందుకు అన్న ఎన్నో కుయుక్తులు పన్నాడని అందుకనే పార్టీ నుంచి వెళ్లానని చెప్పుకచ్చింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు షర్మిలపై అప్పటి నుంచి ఇప్పటి వరకు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అన్న ఆస్తిని అమ్మే హక్కు షర్మిలకు ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆయన అభిమానంతో రూ.200 కోట్లు ఇచ్చారని అంటున్నారు. అయితే షర్మిల మాత్రం తనను తాను బాధితురాలిగా చూపించుకుంటూనే ఉన్నారు. ఈ విధానం వల్ల ఆమె ఏం సాధిస్తుందో, ఏది న్యాయంగా భావిస్తుందో తెలియడం లేదు.
అంతిమంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత ఆస్తి నుంచి ఏదైనా ఇవ్వాల్సి ఉంటుందని, షర్మిల తన అభిమానాన్ని కాపాడుకోవాలనుకుంటే ఆమె బహిరంగ ప్రకటనలు ప్రతికూలంగా ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. షర్మిలకు మద్దతుగా మాట్లాడాలని వైఎస్ విజయమ్మపై ఒత్తిడి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ముందడుగు వేసి బహిరంగ ప్రకటన చేస్తారా? లేక మౌనంగా ఉండి పార్టీ మారుతారా? కాలమే చెబుతుంది.