Diwali: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక నివాసం వైట్ హౌస్ లో దీపావళి వేడుకలో భాగంగా మిలిటరీ బ్యాండ్ ‘‘ఓం జై జగదీష్ హరే’’ పాటను ప్రదర్శించింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీత గోపినాథ్ ఎక్స్ లో ఈ వీడియోను పంచుకున్నారు. వైట్ హౌస్ మిలిటరీ బ్యాండ్ దీపావళికి ఓం జగదీష్ హరే ప్లే వినడం చాలా అద్భుతంగా ఉంది. ప్రెసిడెంట్ బైడెన్ వైట్ హౌస్ లో దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. అమెరికన్లకు తన శుభాకాంక్షలు తెలిపారు.