
మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫ్లూ రూపాంతరం చెందుతూ కలకలం సృష్టిస్తోంది. భారత్ లో H3N2 virus వేగంగా ప్రబలుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా అత్యంత వేగంగా కేసులు పెరుగుతున్నాయి. దాంతో కీలక ఆదేశాలు జారీ చేసింది ICMR. జలుబు , దగ్గు , జ్వరం , ఒళ్ళు నొప్పులు , శ్వాసకోశ ఇబ్బందులతో బాధలు పడుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, యాంటీ బయాటిక్స్ అతిగా వాడొద్దని డాక్టర్ల సలహా మేరకు మాత్రమే మెడిసిన్స్ వాడాలని సూచించారు.
ఇక రోజు రోజుకు H3N2 Virus కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఈ వైరస్ తో ఆరుగురు మరణించారు. పిల్లలు , వృద్ధులు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఈ ఫ్లూ తో బాధపడుతున్నారు. అయితే ఇది H3N2 virus అని తెలియక సాధారణ జ్వరమని అనుకుంటున్నారు. అయితే దేశ వ్యాప్తంగా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.