Lady Maya ఆమెకు పెళ్లిళ్లంటే లెక్కేలేదు. వివాహంటే గౌరవం లేదు. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకుంది. ఒకరిని కాదని మరొకరిని చేసుకుంది. ఒకరు లేదా ఇద్దరిని చేసుకోవాలంటేనే ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ ఆమె మాత్రం తెగించి ఏకంగా 27 పెళ్లిళ్లు చేసుకోవడం గమనార్హం. అయినా ఒకరికి దొరకకుండా మరొకరిని చేసుకుని అందరికి షాక్ కలిగించింది.
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఈ పరిణామానికి అందరు నివ్వెరపోతున్నారు. ఒక మహిళ ఇంతమందిని మోసం చేసి అందరిని బురిడీ కొట్టించడం అంటే మాటలు కాదు. దానికి ఎన్నో తెలివితేటలు కావాలి. ఎవరి దగ్గర కూడా నెల రోజులు ఉండలేదు. ఎవరిని పెళ్లి చేసుకున్నా ఓ ఇరవై రోజులు ఉండటం తరువాత అక్కడ నుంచి డబ్బులు, నగలు దోచుకుని చెక్కేయడం ఆమెకు అలవాటుగా మారింది.
దీంతో అందరు ఆమె ఫొటో పట్టుకుని నా భార్య తప్పిపోయిందని పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. పోలీసులు అందరి వద్ద ఒకే ఫొటో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఒక ఖిలాడీ ఇంతమందిని మోసం చేసిన విధం తెలుసుకుని అవాక్కయ్యారు. అంత మందిని మోసం చేసిన మహిళ తెలివికి పరేషాన్ అవుతున్నారు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇదేదో నెట్ ఫ్లిక్ షో లాగే ఉందని ట్వీట్ చేయడం గమనార్హం.
ఆమెను పెళ్లి చేసుకున్న వారిలో 12 మంది పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఒక మాయలేడి ఇంతమందిని ఒకే తరహాలో మోసం చేయడం విస్తుగొలిపింది. అందరు కలిసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి రావడంతో ఇక మీదట అయినా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మాయలేడి వలలో పడి తమ వస్తువులు పోగొట్టుకోరాదని సూచిస్తున్నారు.