5th Floor Petrol Bunk:పెట్రోల్ పంపు (గ్యాస్ స్టేషన్) ఎక్కడుంటుంది? ఎవరినైనా ప్రశ్నిస్తే రైట్ లో లేదా లెఫ్ట్ లో దాని పక్కన.. దీని పక్కన.. అని అడ్రస్ చెప్తారు. కానీ ఇక్కడ అప్ (పైన) అని చెప్పాలి. అదేంటి పెట్రోల్ పైపు పైన ఉంటే అక్కడికి ఎలా వెళ్లాలి అనే సందేహం కలుగడం సర్వసాధారణం. కానీ ఇక్కడ అలాగే ఉంది. పెట్రోల్ పంపును ఏకంగా 5వ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. వామ్మో అన్ని ఫోర్ల వరకు ఎలా వెళ్లాలి. ఇంధనం (పెట్రోల్, డీజిల్) లేకుంటేనే బంక్ కు వస్తారు. ఐదంతస్తులు వెహికిల్ ను ఎలా తీసుకెళ్లాలన్న అనుమానం కలుగక మానదు.. ఇక్కడో సీక్రెట్ కూడా ఉంది.. అదేంటంటే..?
చైనాలో ఒక ప్రాంతంలో పెట్రోల్ పంపును 5వ అంతస్తు (ఫ్లోర్)లో ఏర్పాటు చేశారు. ఇది చూసిన అందరూ నివ్వెర పోయారు. స్వయానా అక్కడికి వెళ్తేగాని అర్థం కాదు అది అక్కడ ఎందుకు కట్టారోనని. అయితే, ఆ ప్రాంతంలో నేల ఐదు అంతస్తుల వరకు అప్ అండ్ డైన్ గా ఉంటుంది. అంటే ముందు వైపునకు ఐదంతస్తుల కిందకు ఉంటే.. వెనుక వైపునకు రోడ్డుకు సమానంగా ఉంటుంది. ముందు వైపున పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసిన సంస్థ వెనుక వైపు రోడ్డుకు వైపునకు కూడా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని అనుకుంది. దీనిలో భాగంగా ఐదంతస్తుల ఫ్లోర్ నిర్మించి అక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసింది. అంటే పైన ఉన్న పెట్రోల్ బంక్ కు వెళ్లాలంటే రోడ్డుపై నుంచి వెళ్తే సరిపోతుంది. భవనం నుంచి వెళ్లాల్సిన పనిలేదన్నమాట.
ఈ వీడియోను చూసిన చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. నిజంగా ఐదు ఫ్లోర్లు వెళ్లి నింపుకోవాలా అనుకున్నారు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ బంకు రోడ్డుకు సమానంగానే ఉంది. ఇంజినీర్ తెలివి చూసి అందరూ వాహ్వా అనుకుంటున్నారు.