ఆర్ ఎస్ ఎస్ గొప్పతనం గురించి గొప్ప సినిమా తీయబోతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయేంద్ర ప్రసాద్ ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో మరోసారి ప్రభంజనం సృష్టించారు. కట్ చేస్తే ……. మోడీ ప్రభుత్వం విజయేంద్ర ప్రసాద్ ని రాజ్యసభ సభ్యుడిగా నియమించింది.
అయితే అంతకుముందు కొంతమంది ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు వచ్చి విజయేంద్ర ప్రసాద్ ని కలిసారట. ఆర్ ఎస్ ఎస్ గురించి గొప్పగా చెబుతుంటే….. నేను అంతకుముందు ఆర్ ఎస్ ఎస్ గురించి చెడుగా విన్నదంతా తప్పు అని తెలిసింది. ఆర్ ఎస్ ఎస్ గొప్పతనం తెలిసాక తప్పకుండా సినిమా చేయాల్సిందే అని డిసైడ్ అయ్యాను. కథ కూడా రెడీగా ఉంది. నాగ్ పూర్ వెళ్లి మరింత వివరంగా తెలుసుకొని మోహన్ భగవత్ గారిని కలిశాను. కథ విని ఆయన చాలా సంతోషించారన్నారు విజయేంద్ర ప్రసాద్.