
నంది కడుపున పందిపుడుతుందని బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు. కలియుగంలో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటాయని తన పుస్తకంలో ఆనాడే రాశారు. అవి ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆయన చెప్పిన చాలా విషయాలు మనకు కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ఇప్పుడు ఆవు కడుపులో సింహం జన్మించడంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. కాకపోతే ఇది జరిగింది మన రాష్ట్రంలో కాదు మధ్యప్రదేశ్ లో.
రాష్ట్రంలోని రైసెన్ జిల్లాలోని గూర్ఖా అనే గ్రామంలో నత్తులాల్ శిల్పాకర్ అనే రైతుకు చెందిన ఆవు కడుపులో సింహాన్ని పోలిన దూడ జన్మించింది. దీంతో విషయం దావానంలా వ్యాపించడంతో అందరు క్యూ కట్టారు. దూడను చూసేందుకు ఎగబడ్డారు. వింత దూడను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
ఆవు గర్భాశయంలో జన్యు పరమైన లోపం కారణంగా దూడ ఇలా సింహం ఆకారంలో పుట్టిందని పశువైద్యాధికారి తేల్చారు. ఒక్కోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఇందులో కొత్తేమీ కాదు. వింతేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. కానీ జనం మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. సింహం ఆకారంలో ఉండే దూడను చూసేందుకు వస్తున్నారు.
పిండం సరిగా ఎదగకపోవడంతోనే ఇలాంటి ఆకారంతో జన్మించిందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఎలాంటి అద్భుతం లేదన్నారు. ఆవు గర్భంలోనే ఉన్న లోపంతో ఇలాంటి దూడకు జన్మనిచ్చిందన్నారు. కలియుగం అంతానికి వచ్చిందనే వాదనలు వస్తున్నాయి. బ్రహ్మంగారు ఏనాడో చెప్పిన విషయాలు దాఖలాలు అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయని సూచిస్తున్నారు.






