Viral Poster : కొందరికి కొన్ని ఐడియాలు ఎలా వస్తాయో అర్థం కాదు. డిఫరెంట్ గా ఆలోచిస్తుంటారు. సమాజం తమను గుర్తించాలని, జనాల్లో ఏదో అటెన్షన్ తెప్పించాలని తహతహలాడుతుంటారు. ఈక్రమంలో కొన్ని తుంటరి పనులు, నవ్వుతెప్పించే, నోరు వెళ్లబెట్టే పనులు కూడా చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ప్రపంచంలో ఏ మూలన చిన్న సంఘటన జరిగినా అది క్షణాల్లో ప్రపంచమంతటా పాకిపోతోంది. దీంతో ఎన్నెన్నో ఘటనలు చూసి మనం నవ్వుకోవాల్సి వస్తోంది.
ఇక గతంలో మన ఊళ్లలో జాతరలో, పండుగలో వస్తుంటే రాజకీయ నాయకులకు, ప్రముఖులకు ఆహ్వానం పలికేందుకు వాల్ పోస్టర్లు, క్లాత్ బ్యానర్స్ రాయించేవారు. ఇప్పుడంతా ఫ్లెక్సీల కాలం కావడంతో ఇప్పుడూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే కనపడుతున్నాయి. అయితే ఓ యువకుడు వేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ యువకుడు ఏదో జనాలను బురిడి చేయడానికో, సరదాగా వేసిందో కావొచ్చు..కానీ దాన్ని చూసి జనాలంతా అవాక్కైపోతున్నారు. ఈ పోస్టర్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో వేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ దానిలో ఏముందంటే..
దుర్గా కుమార్ అనే యువకుడు తన ఫోన్ నంబర్ ను పోస్టర్ పైభాగంలో ముద్రించి కింద తన పేరు రాసుకున్నాడు. ఆ తర్వాత ‘‘…కాక మీద ఉన్న అబ్బాయిలకు, అంకుల్స్ కు కత్తిలాంటి అమ్మాయిలను, ఆంటీలను సప్లయ్ చేయబడును’’ అంటూ పోస్టర్ లో ముద్రించాడు. అమ్మాయిలకు, ఆంటీలకు ఈ రేట్ అంటూ ఓ ధరల పట్టికను సైతం ముద్రించాడు. అయితే ఆ పోస్టర్ పై దసరా కానుక అని ఉంది..ఇప్పుడు సంక్రాంతి వేళ అది వైరల్ అవుతోంది. అంటే ఆ పోస్టర్ అప్పుడే వేసినా ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ పై కొందరు మండిపడుతున్నా.. ఫన్నీగా తీసుకునే వారే ఎక్కువైపోయారు.