Lovers ప్రేమికులు ఓ పథకం వేసుకున్నారు. రోజు వారు కలుసుకోవడానికి కరెంటు అడ్డంగా ఉందని ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేసి దాని దగ్గర వారి కామకలాపాలు తీర్చుకునే వారు. ప్రతిరోజు ఒకే సమయానికి విద్యుత్ తీసివేయడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వారిని ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. వారు కలుసుకునే సమయానికి అక్కడకు చేరుకోవడంతో అడ్డంగా బుక్కయ్యారు. వారి సుఖం కోసం ఊరంతా కరెంటు లేకుండా చేయడంపై కన్నెర్ర జేశారు.
బిహార్ లోని బేతియా జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రోజు రాత్రి పూట ఒకే సమయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. గత కొంత కాలంగా గ్రామం అంధకారంలో ఉండిపోతోంది. ఆ సమయంలో రెండు ద్విచక్రవాహనాలు, కరెంట్ మోటార్లు, పలు మేకలు చోరీకి గురయ్యాయి. దీంతో గ్రామస్తులు ఎలాగైనా వారిని పట్టుకోవాలని అనుకున్నారు. వారు కలుసుకునే ప్రదేశంలో మాటు వేశారు.
రోజువారీ అలవాటులో భాగంగా వారు వచ్చి ట్రాన్స్ ఫార్మర్ ను ఆఫ్ చేసే క్రమంలో దొరకబట్టారు. యువతీ యువకుడు వారి సుఖం కోసం గ్రామంలో కరెంట్ లేకుండా చేస్తున్నారు. దీంతో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏకాంత సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆనంద డోలికల్లో మునిగిపోయేవారు. గ్రామస్తులు పట్టుకోవడంతో వారి బండారం బట్టబయలైంది.
గ్రామస్తులను మోసం చేస్తున్న జంటను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇన్నాళ్లుగా తమకు నిద్ర లేకుండా చేసిన వారి నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వారికి పెళ్లి చేసేందుకు అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. కానీ గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేసిన వారిని అందరు తిట్టిపోశారు. వారి సుఖం కోసం మాకు కష్టాలు తీసుకొచ్చారని ఆగ్రహంతో వారిని తిట్టారు.