
అమెరికా వెళ్లాలని అనుకుంటున్న వాళ్లకు తీవ్ర శరాఘాతం అనే చెప్పాలి ఈ వార్త ఎందుకంటే …….. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఇప్పట్లో వీసా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. అమెరికా వీసా కోసం ప్రయత్నించే వాళ్ళు 500 రోజులకు పైబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఢిల్లీ లోను అలాగే ముంబై లోను 500 రోజులకు పైగా సమయం పడుతుందని వెల్లడిస్తున్నారు వీసా అధికారులు.
కరోనా ఉదృతి తగ్గిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని , అలాగే ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లే వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. దాంతో ఈ తాకిడి ఎక్కువ అయినట్లు చెబుతున్నారు అధికారులు. క్రిస్మస్ వేడుకలకు వెళ్లాలని ఇప్పుడు వీసా కోసం ప్రయత్నం చేస్తే బహుశా వచ్చే ఏడాది మాత్రమే క్రిస్మస్ వేడుకలకు వెళ్లే ఛాన్స్ ఉందని , ఈ ఏడాది వీసాలు మంజూరు కావడం కష్టమే అని తేల్చి చెబుతున్నారు. ఒక్క అమెరికాలోనే వీసాల సమస్య తలెత్తడం లేదు . కెనడా , యూకే లాంటి దేశాల్లో కూడా వీసాల సమస్య ఉందని అంటున్నారు.