
పొగమంచు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా మంచుతో చాలా ఇబ్బందులు పడుతోంది. తాజాగా చైనాలో కూడా పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు. పొగమంచు కారణంగా 200 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దాంతో పెద్ద ఎత్తున వాహనాలు ధ్వంసం అయ్యాయి. పొగమంచు కారణంగా ఎదురుగా ఏమి కనిపించక పోవడంతో వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి. దాంతో 200 వాహనాలకు పైగా దెబ్బతిన్నాయి.