
ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఆస్కార్ అందుకుంది తెలుగు సినిమా. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ పేరు మారుమ్రోగుతోంది. ఇక నాటు నాటు అనే పాట అయితే డ్యాన్స్ రాని వాళ్ళ చేత కూడా డ్యాన్స్ చేయిస్తోంది. ఎందుకంటే ఆ పాట అంత నాటు నాటు మరి. ప్రపంచమంతా నాటు నాటు మాయలో పడింది.
ఇంకేముంది నాటు నాటు అంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అలా న్యూజెర్సీలోని ఎడిసన్ లో చేస్తున్న కార్యక్రమమే Electrifying Rhythms . మార్చి 19 న ఎడిసన్ లో టెస్లా కార్లతో నాటు నాటు సాంగ్ ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. నాటు నాటు అనే పాటకు మాస్ బీట్ కు తగ్గట్లుగా టెస్లా కార్లతో మెరుపులు మెరిపించ నున్నారు. సాంగ్ కు తగ్గట్లుగా అద్భుతమైన వెలుగులతో ప్రవాసాంధ్రులు సంబరాలు చేసుకోనున్నారు. మిగతా వివరాలకు బ్రోచర్ ను గమనించగలరు.
