అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ సదరన్ జిల్లా జడ్జిగా భారత సంతతికి చెందిన అరుణ్ సుబ్రహ్మణ్యన్ ని నియమించింది జో బైడెన్ ప్రభుత్వం. ఇప్పటికే అమెరికాలో పలువురు భారతీయులకు అలాగే భారత సంతతికి చెందిన వాళ్లకు పలు కీలక హోదాలలో పదవులు లభించాయి.
అయితే న్యాయమూర్తిగా మాత్రం మన భారతీయ మూలాలున్న వ్యక్తి నియామకం జరగలేదు. ఆ ఘనత సాధించింది అరుణ్ సుబ్రహ్మణ్యన్ మాత్రమే ! దాంతో పలువురు భారతీయులు అరుణ్ నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.