టెక్సాస్ లో ఇండియన్ స్టూడెంట్ కు ఘోర అవమానం జరిగింది. టెక్సాస్ లోని కాపేల్ ప్రాంతంలో గల ఒక పాఠశాలలో భారతీయ మూలాలున్న స్టూడెంట్ చదువుకుంటోంది. ఆమె క్యాంటిన్ లో తింటున్న సమయంలో ఓ అమెరికా స్టూడెంట్ వచ్చి ఆమె కూర్చున్న చోటు నుండి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాడు.
ఇక్కడ ఖాళీగా ఉంటేనే కూర్చున్నాను , ఇప్పుడు నువ్వొచ్చి వెళ్లి పోమంటే ఎందుకు వెళ్తాను అంటూ దిక్కరించింది. దాంతో ఆ అమెరికా స్టూడెంట్ రెచ్చిపోయి ఇండియన్ స్టూడెంట్ ని ఘోరంగా అవమానించడమే కాకుండా చేయి కూడా చేసుకున్నాడు. ఈ ఘోరం అందరూ చూస్తుండగానే జరిగింది. అయినప్పటికీ ఎవరు కూడా స్పందించలేదు. పైగా ఇండియన్ స్టూడెంట్ దే తప్పు అంటూ మూడు రోజుల పాటు సస్పెండ్ చేయడం దారుణం. ఈ విషయం తెలిసి భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.