
మన దాయాది దేశమైన పాకిస్థాన్ లో హిందువుల ఆరాధ్య దైవం శివుడికి ఆదరణ పెరుగుతోంది. పాకిస్థాన్ లో శివుడికి పూజలు చేయడం , ఆరాధించడం ఏంటి ? అని షాక్ అవుతున్నారా ? ఇది నిజమే సుమా ! ఎందుకంటే పాకిస్థాన్ ఒకప్పుడు భారత్ లో అంతర్భాగం అనే విషయం తెలిసిందే. అయితే మన దేశ స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు పాకిస్థాన్ విడిపోయింది. భారత్ హిందూ దేశం కాబట్టి హిందువులు దేశమంతటా ఉన్నారు. అలాగే పాకిస్థాన్ లో కూడా పెద్ద ఎత్తున హిందువులు ఉన్నారు.
ఇక దేశ విభజన తరువాత పాక్ లోని హిందువులు ఎక్కువ సంఖ్యలో రాగా కొంతమంది మాత్రం పాక్ లోనే ఉండిపోయారు. అలా సింధ్ రాష్ట్రంలోని ఉమర్ కోట్ లో కూడా మన మూలాలున్న భారతీయులు ఉన్నారు. వాళ్ళు నిత్యం శివుణ్ణి స్మరిస్తూ పూజలు నిర్వహిస్తుంటారు. ఉమర్ కోట్ లో ఉన్న జనాభాలో దాదాపు 80 శాతం మంది హిందువులు కావడం విశేషం. ఇక ఈ శివుడి మహత్యం ఏంటో తెలుసా…….. పెద్ద ఎత్తున ఆవులను ఈ ప్రాంతంలో మేత కోసం తీసుకొస్తున్న సమయంలో ఆవులు శివలింగం దగ్గరకు వచ్చి పాలు ఇస్తుండేవట. ఇలా పాలు ఎందుకు ఇస్తున్నాయి ? అక్కడ ఏముందని ఆరా తీయగా శివ మహత్యం బయట పడిందట. దాంతో అప్పటి నుండి శివయ్యకు పూజలు నిర్వహిస్తున్నారు మన హిందువులు. కరడుగట్టిన పాకిస్థాన్ లో మన శివయ్యకు పూజలు లభించడం అంటే మాటలు కాదు సుమా! ఇదంతా ఆ శివయ్య మహిమే అనుకుంటా .