
ఆర్ధిక మాంద్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ పెద్ద ఎత్తున జాబ్ నుండి తొలగిస్తున్నారు. ఇప్పటికే మెటా , మైక్రో సాఫ్ట్ ఆ పని చేయగా తాజాగా మరికొన్ని సంస్థలు ఇదే పని మొదలు పెట్టే పనిలో పడ్డాయి.
తాజాగా అమెజాన్ కూడా ఇదే బాటలో నడవడానికి సిద్ధమైంది. అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల మంది సిబ్బందిని తొలగించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. దాంతో అమెజాన్ లో పని చేస్తున్న 10 వేల మంది ఉపాధి కోల్పోనున్నారు.