
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చింది అమెరికా సుప్రీం కోర్టు. 2015 నుండి 2020 మధ్య కాలంలో ట్రంప్ తన రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలను అలాగే స్థిర చరాస్తుల ట్యాక్స్ రిటర్న్ వివరాలు కూడా గోప్యంగా ఉంచాడు. అయితే ఆ వివరాలు ఇవ్వాలని పార్లమెంట్ సభ్యులు కోరారు కానీ ట్రంప్ మాత్రం నిరాకరించాడు. దాంతో సుప్రీం ను ఆశ్రయించారు.
ఇంకేముంది అమెరికా సుప్రీం కోర్టు విచారణ చేపట్టి ఆదాయ పన్ను వివరాలు పార్లమెంట్ సభ్యులకు తెలియాల్సిందే అని తీర్పు వెలువరించింది. దాంతో ట్రంప్ కు చుక్కెదురయింది. 2015 నుండి 2020 వరకు ట్రంప్ చెల్లించిన ఆదాయపన్ను వివరాలు ఇప్పుడు బహిర్గతం కానున్నాయి. ఇలా బహిర్గతం కావడం వల్ల పన్నులు పూర్తి స్థాయిలో చెల్లించాడా ? లేక ఏమైనా మినహాయింపులు పొందాడా ? అనే విషయం తేలనుంది. పూర్తి స్థాయిలో పన్నులు చెల్లించినట్లు తేలితే అది ట్రంప్ కు లాభం చేకూరనుంది. ఎందుకంటే 2024 లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడనున్నాడు కాబట్టి. ఒకవేళ ఏవైనా మినహాయింపులు పొందితే కనుక తప్పకుండా ట్రంప్ కు ఇబ్బంది కానుంది.