భారతీయ మహిళపై భౌతిక దాడులకు పాల్పడింది ఓ అమెరికన్ మహిళ. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు గన్ కల్చర్ అమెరికాను వణికించింది కాగా ఇపుడు కొంతమంది అమెరికన్ మహిళలు , అలాగే పురుషులు భారతీయులపై దాడులకు పాల్పడుతున్నారు.
భారతీయుల వల్ల అమెరికన్లు తమ అవకాశాలు కోల్పోతున్నారనే అసహనం వ్యక్తం అవుతోంది. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారని ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా డల్లాస్ లో ఓ అమెరికన్ లేడీ ఓ భారతీయ మహిళపై బూతుల వర్షం కురిపించింది. అంతేకాదు ఎందుకు తిడుతున్నావ్ ? అని ప్రశ్నించినందుకు బూతులు తిట్టడమే కాకుండా విపరీతంగా కొట్టింది కూడా. సదరు భారతీయ మహిళ అక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పటికీ వెంటపడి మరీ కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలాంటి దాడుల పట్ల పలువురు భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Breaking News