అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మొట్ట మొదటిసారిగా ఆటా 17 వ సమావేశాలు వాల్తేర్ ఏ కన్వెన్షన్ సెంటర్ లో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. జూలై 1 నుండి 3 వ తారీఖు వరకు మొత్తం 3 రోజుల పాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ వేడుకలలో హీరోలు నందమూరి బాలకృష్ణ , విజయ్ దేవరకొండ , హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , క్రికెటర్ కపిల్ దేవ్ , సద్గురు తదితరులతో పాటుగా పలువురు తెలుగు రాష్ట్రాల మంత్రులు , రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. ఇక స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా చేత సంగీత విభావరి నిర్వహించడం. ఈమేరకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గం పలువురు సినీ , రాజకీయ ప్రముఖులతో పాటుగా పలువురు వ్యాపారవేత్తలను కూడా వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించింది. ఈ వేడుకలో దాదాపు 10 వేలమంది ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.