అమెరికాలో తాజాగా మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు భారత సంతతికి చెందిన వాళ్ళు విజయం సాధించగా తాజాగా ఆ జాబితాలో చేరింది ఇండో అమెరికన్ ఐన నబీలా సయ్యద్. ఈమె వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే కావడం విశేషం. దాంతో అతిపిన్న వయసులోనే ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది.
నబీలా సయ్యద్ తన సమీప ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని భారీ తేడాతో ఓడించింది. సయ్యద్ నబీలా కు 52 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతోంది నబీలా సయ్యద్.