తెలుగుదేశం పార్టీ ప్రవాసాంధ్రులతో కలిసి పలు కార్యక్రమాలను రూపొందించడానికి అలాగే ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో అభిమానులతో కలిసి ఎన్నారై ఎంపవర్ మెంట్ కమిటీలను వేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆ కమిటీలు వేయగా తాజాగా నార్త్ అమెరికా , గల్ఫ్ దేశాల కమిటీలను ప్రకటించారు.
నార్త్ అమెరికా కోఆర్డినేటర్ గా మల్లిక్ మేదరమెట్ల ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసాడు కింజరాపు అచ్చెన్నాయుడు. నార్త్ అమెరికాతో పాటుగా గల్ఫ్ ( కువైట్ , ఖతార్ , ఒమన్ , బహ్రెయిన్ , కోఆర్డినేటర్ గా సుధాకర్ కుదరవల్లి , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , సౌదీ అరేబియా లకు తులసి కుమార్ ముక్కు లను నియమించారు అచ్చన్నాయుడు. ఆమేరకు పత్రికా ప్రకటన విడుదల చేసారు.