అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్. డొనాల్డ్ ట్రంప్ రాజకీయ నాయకుడు కంటే వ్యాపారవేత్తగా సుపరిచితులు అనే విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తండ్రి బాటలో పయనిస్తున్నాడు తనయుడు జూనియర్ ట్రంప్. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ట్రంప్ సంస్థల ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
ఇక భారత్ లో పర్యటన ఎందుకంటే ……. రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాడు ట్రంప్ జూనియర్. ఇక్కడ పూణే , హైదరాబాద్ , ముంబై , ఢిల్లీ , కోల్ కతా లలో లగ్జరీ ఫ్లాట్ లను , అపార్ట్ మెంట్ లను నిర్మిస్తున్నారు భారత్ లోని ఇతర సంస్థలతో కలిసి. ఇక హైదరాబాద్ లో ”లోధా ” అనే సంస్థతో కలిసి పెట్టుబడులు పెట్టాడు ట్రంప్ జూనియర్. పూణే లో నిర్మించిన లగ్జరీ ఫ్లాట్ ల నిర్మాణం పూర్తి కావడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈనెలలోనే భారత్ లో అడుగు పెట్టనున్నాడు ట్రంప్ జూనియర్.