అమెరికాలో గన్ కల్చర్ విపరీత పోకడలు పోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షలాదిగా అమెరికాలో కాల్పుల సంఘటనలు జరిగాయి. అక్కడ కాల్పులకు తెగబడటం చాలా కామన్ అయిపోయింది. దాంతో అమెరికాలో గన్ కల్చర్ ని తగ్గించడానికి , రూపు మాపడానికి జో బైడెన్ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసాడు.
ఇక కాల్పుల సంఘటన విషయానికి వస్తే …… టెక్సాస్ లోని యువాల్డె ఎలిమెంటరీ స్కూల్ లో 18 ఏళ్ల గన్ మెన్ విరుచుకుపడ్డాడు. స్కూల్ పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 19 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. అలాగే మరో ఇద్దరు కూడా ఈ సంఘటనలో చనిపోయారు. ఆగంతకుడు ఎలిమెంటరీ స్కూల్ పై దాడి చేయడానికి ముందు తన ఇంట్లోనే బామ్మని సైతం కాల్చి చంపాడట. స్కూల్ పిల్లలపై దారుణంగా కాల్పులకు తెగబడటంతో అతడ్ని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు.