
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా ) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్ లో శనివారం ఆటా బోర్డ్ సమావేశం జరుగగా ఆ సమావేశంలో నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అధ్యక్షులు భువనేష్ భూజల తన బాధ్యతలను మధు బొమ్మినేని కి అప్పగించారు. ఈ కార్యక్రమానికి ఆటా డైరెక్టర్ లు , సలహాదారులు , మాజీ అధ్యక్షులు , స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు, ఆటా సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నుండి ఆటా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పలు పదవులను సమర్ధవంతంగా నిర్వహించారు.
ఆటా లోని 16 బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన సభ్యులు నాలుగేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. అనిల్ బొద్దిరెడ్డి , సన్నీ రెడ్డి , కిరణ్ పాశం , కిషోర్ గూడూరు, మహిధర్ , నర్సిరెడ్డి , రామకృష్ణా రెడ్డి , రాజు కక్కేర్ల , సాయి సుధీని, శ్రీకాంత్ గుడిపాటి , నర్సింహారెడ్డి, రఘువీర్ , సాయి నాథ్ , సతీష్ రెడ్డి శ్రీనివాస్ , వినోద్ తదితరులు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక ఆటా బోర్డ్ ఏకగ్రీవంగా జయంత్ చల్లాను కాబోయే ప్రెసిడెంట్ గా ఎన్నుకుంది.
ఆటా బోర్డ్ 2023 – 24 టర్మ్ కు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి అల ( కార్యదర్శి ) సతీష్ రెడ్డి ( కోశాధికారి) యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ( జాయింట్ సెక్రటరీ) గూడూరు రవీందర్ (జాయింట్ ట్రెజరర్ ) హరిప్రసాద్ రెడ్డి లింగాల ( ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ) గా ఎన్నికయ్యారు.