అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అమెరికాలోని మేరీ ల్యాండ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సాయి చరణ్ (26) దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. తన స్నేహితులతో కలిసి వీకెండ్ లో సరదాగా కారులో వెళ్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరుపగా ఆ కాల్పుల్లో సాయిచరణ్ మృతి చెందాడు. దాంతో తీవ్ర విషాదం నెలకొంది.
మేరీ ల్యాండ్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న సాయిచరణ్ తెలంగాణ లోని నల్గొండ జిల్లా వాసి. రెండేళ్ల క్రితమే అమెరికా వెళ్ళాడు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే మేరీ ల్యాండ్ లో జాబ్ చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో ఆదివారం రోజున సరదాగా వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడంతో సాయిచరణ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. జూన్ 19 న ఈ దారుణ సంఘటన జరిగింది.