Ublood app ఫౌండర్, JSW & Jaiswaraajya.tv అడ్వైజర్ డాక్టర్ జై యలమంచిలిని అవార్డ్ వరించింది. ఒకవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే మరోవైపు సామాజిక బాధ్యత గుర్తెరిగి యు బ్లడ్ వంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డాక్టర్ జై యలమంచిలి. మేకిన్ ఇండియాలో భాగంగా తనవంతు బాధ్యతగా…… పుట్టిన దేశం కోసం …… తనని ఇంతగా పెంచి పెద్ద చేసిన ప్రాంతం కోసం నడుం బిగించారు.
ఈరోజుల్లో సహజంగానే పెద్ద ఎత్తున రక్తం అవసరం పడుతోంది. రకరకాల ఆపరేషన్ల కోసం అలాగే రకరకాల రోడ్డు ప్రమాదాలలో గాయాల పాలైన వాళ్లకు తక్షణం రక్తం కావాలి. ఇలాంటి సమయాల్లో సరైన సమయానికి రకరకాల గ్రూప్ లకు సంబంధించిన రక్తం అవసరమేర్పడుతుంది. అయితే సరైన సమయంలో రక్తం దొరకక చనిపోయిన వాళ్ళు కోకొల్లలు. అలాంటి వాళ్లకు ఏకైక సంజీవని ” UBlood app “. ఇందులో రక్తదాతల, రక్త గ్రహీతల సమగ్ర సమాచారం ఉంటుంది. దాంతో ఇది ప్రజలకు ఎంతగానో ప్రయోజనకారిగా మారింది.
దాంతో సంజీవని లాంటి యాప్ ను సృష్టించిన డాక్టర్ జై యలమంచిలిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక UBlood app కు అభినవ దాన కర్ణుడుగా పేరుగాంచిన విలక్షణ నటుడు సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం విశేషం. జై యలమంచిలిని సన్మానించి స్టార్టప్ స్టైర్స్ అవార్డుతో సత్కరించటం జరిగింది. ” Startup Investment Feliciation Ceremony Growth Acceleration Program ” జరిగింది. మేకిన్ ఇండియాలో భాగంగా పలు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగానే డాక్టర్ జై యలమంచిలిని ” Startup Stairs ” అనే అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు సోనూ సూద్ తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తనకు అవార్డ్ రావడం పట్ల , సన్మానం జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు డాక్టర్ జై యలమంచిలి. ఈ అవార్డుతో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామన్నారు. డాక్టర్ జై యలమంచిలి సేవలను గుర్తించి Startup Stairs award తో సత్కరించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు JSW & Jaiswaraajya.tv సంస్థల గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్.