అమెరికాలో గడ్డు రోజులు దాపురించాయి. 40 ఏళ్ల కాలంలో ఈ స్థాయి ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే మొదటి సారి. రష్యా – ఉక్రెయిన్ ల మధ్య జరిగిన యుద్ధ వాతావరణం వల్ల ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ద్రవ్యోల్బణం నెలకొంది. దాంతో పలు దేశాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో చిక్కుకోగా ఆ జాబితాలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా చేరిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
8.6 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. ఏప్రిల్ , మే నెలల్లో ఈ ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరం ఆఖరులో 7 శాతానికి ద్రవ్యోల్బణం దిగి రావచ్చని భావిస్తోంది జో బైడెన్ సర్కారు. గ్యాస్ , ఆహారం , ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో గగ్గోలు పెడుతున్నారు జనాలు.