2024 లో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మిచెల్ ఒబామా పోటీ చేయనున్నట్లు పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. దాంతో ఆ వార్తలపై స్పందించింది మిచెల్ . తాను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడని, అతడు రెండోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలా ? వద్దా అనేది బైడెన్ వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేసింది మిచెల్. ఈ భామ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య అనే విషయం తెలిసిందే.
Breaking News