
కాన్సస్ నగరంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కాన్సస్ సిటీ తెలంగాణ అసోసియేషన్ (KCTCA ) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ కాన్సస్ సిటీ ( TAGKC ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో 1500 మందికి పైగా మహిళలు , పురుషులు పాల్గొన్నారు.
దేవుళ్ళకు పూలతో పూజ చేస్తారు ఎక్కడైనా సరే …….. కానీ తెలంగాణ బతుకమ్మ పండుగ మాత్రం పూలనే దేవతలుగా కొలిచే అరుదైన పండుగ. అలాంటి ఈ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకుంటారు. కాన్సస్ లో కూడా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలో శ్రీదేవి , కిరణ్ , సరిత, సూర్య , సందీప్ , సుష్మ , సరళ , జయ , బిందు , రాజ్ , నీలిమ , సునీల్ , పద్మజ , సిరి, రూప , విజయ్ , సుచరిత , విశ్వా , వాసు , వెంకట్ రావు , వెంకట్ తదితరులు పాల్గొన్నారు.