బతుకమ్మ ఉత్సవాల ఖ్యాతి ఖండాంతరాలను దాటుతోంది. గత 13 సంవత్సరాలుగా అగ్రరాజ్యం అమెరికాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు ప్రవాసాంధ్రులు. తాజాగా న్యూజెర్సీలో కూడా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. జాన్సన్ పార్క్ లో సెప్టెంబర్ 25 న బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు, పిల్లలు పాల్గొన్నారు. బతుకమ్మ లను అందంగా పేర్చి డీజేతో సరికొత్త హంగులు సృష్టించారు. దాంతో అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు ఆలపించారు.
ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్