
అమెరికాలో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు అయిన ఎర్రబెల్లి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా , ఒకసారి ఎంపీగా గెలిచిన ఎర్రబెల్లిని 2018 లో మంత్రి పదవి వరించింది.
తాజాగా ఆటా వేడుకల కోసం అమెరికా వెళ్లారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కాగా ఇదే సమయంలో జులై 5 న ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు కావడంతో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున మంత్రి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో జైస్వరాజ్య , JSW అడ్వైజర్ జగదీశ్ యలమంచిలి , జైస్వరాజ్య , JSW డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ లతో పాటుగా పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.