
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ను బూతులు తిట్టేసింది బ్రిటన్ హీరోయిన్ జమీలా జామిల్. షీ – హల్క్ అనే వెబ్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది ఈ భామ. హాట్ భామగా రాణిస్తున్న ఈ భామకు రిషి సునాక్ మీద కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …….. రిషి సునాక్ ఆర్ధికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదురుకొంటున్న బ్రిటన్ ను గాడిలో పెట్టాలని భావించి కొన్ని కఠిన నిర్ణయాలకు సిద్దమౌతున్నాడు.
దాంతో జమీలా జమీల్ కు ఎక్కడ లేని కోపం వచ్చింది అంతే ……. రిషి సునాక్ ను బూతులు తిట్టేసింది. నువ్వు సంపన్న వర్గానికి చెందిన వాడివి , మితవాడివి…… పైగా అదృష్టం కొద్దీ ప్రధాని పదవి చేపట్టిన వాడివి అందుకే నీకు ప్రజల కష్టాలు అర్ధం కావడం లేదు. కష్టాలు పడుతున్న ప్రజలు తమ నిరసనను తెలపాలని భావిస్తుంటే నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టకుండా ఆంక్షలు విధించాలని చూస్తున్నావ్ అంటూ మండిపడింది.
భారత సంతతికి చెందిన రిషి సునాక్ రాజకీయాల్లోకి ప్రవేశించి పదవీ బాధ్యతలు చేపట్టాడు. అయితే అనూహ్యంగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ప్రధాని పదవికి పోటీ పడ్డాడు. అయితే ఆ పోటీలో లిజ్ ట్రస్ విజయం సాధించింది. రిషి సునాక్ ఓటమి చవి చూసాడు. కానీ అదృష్టం అంటే రిషి సునాక్ దే ! ఎందుకంటే ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ నెల రోజులు కూడా పదవి బాధ్యతలు నిర్వహించకుండానే చేతులు ఎత్తేసింది. దాంతో రిషి సునాక్ రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి ప్రధాని అయ్యాడు. ఒకప్పుడు భారత్ ను బానిసగా చేసి పరిపాలించిన బ్రిటీష్ వాళ్లకు భారతీయుడి సత్తా ఏంటో చూపిస్తున్నాడు.