ఇండియన్ స్టూడెంట్స్ కు శుభవార్త చెప్పింది బ్రిటన్ ప్రభుత్వం. త్వరలోనే ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ వీసాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు బ్రిటన్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఆమేరకు భారత్ లోని బ్రిటన్ రాయబార కార్యాలయం ట్విట్టర్ లో పేర్కొంది. ఇప్పటి వరకు అమెరికాకు మాత్రమే వీసాల తాకిడి ఎక్కువగా ఉందని, కానీ రాబోయే రోజుల్లో బ్రిటన్ వీసాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడనుందని స్పష్టం చేశారు.
గతకొంత కాలంగా బ్రిటన్ వీసాలు జాప్యం అవుతున్నాయని, అయితే రాబోయే రోజుల్లో మాత్రం ఎలాంటి జాప్యం లేకుండా వీసాలను మంజూరు చేయనున్నామని …… అందుకోసం తగిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని భారతీయ విద్యార్థులకు సంకేతాలు ఇచ్చింది బ్రిటన్ ప్రభుత్వం. వీసాల మంజూరులో ఏర్పడిన జాప్యానికి క్షమాపణ చెబుతున్నామని, వీసాలు మంజూరు అయ్యాకే టికెట్లు బుక్ చేసుకోవాలని ఇండియన్ స్టూడెంట్స్ కు విజ్ఞప్తి చేసింది బ్రిటన్ రాయబార కార్యాలయం.