బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్- || ఆరోగ్యం విషమంగా ఉంది. 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ గత ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కనీసం నడవడానికి , నిలబడటానికి కూడా వీలు లేకుండాపోయింది. రాణి ఆరోగ్యం విషమించడంతో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బంకింగ్ హామ్ ప్యాలెస్ లోనే చికిత్స పొందుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని బ్రిటన్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక కొత్తగా ఎన్నికైన ప్రధాని లిజ్ ట్రస్ బ్రిటన్ రాణి త్వరగా కోలుకోవాలని అందుకు ప్రజలంతా ప్రార్థన చేయాలని కోరింది.