బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా క్వాసీ క్వార్టెంగ్ పదవీ బాధ్యతలు స్వీకరించి 38 రోజులు కూడా పూర్తి కాకుండానే పదవి నుండి తొలగించింది బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్. ఇందుకు కారణం ఏంటో తెలుసా…….. క్వాసీ ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్ కారణం. ఇటీవలే ఆర్ధిక మంత్రి గా బాధ్యతలు స్వీకరించాడు క్వాసీ క్వార్టింగ్. దాంతో బ్రిటన్ మినీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టాడు.
అయితే క్వాసీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ తో ఒక్కసారిగా బ్రిటన్ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. దాంతో దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో పడటం ఖాయమని భావించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో క్వాసీ ని ఆర్ధిక మంత్రి గా తొలగించి అతడి స్థానంలో జెరేమీ హంట్ ని కొత్త ఆర్ధిక మంత్రి గా నియమించింది లిజ్ ట్రస్.